Russia: తాత్కాలిక ఒప్పందానికి రష్యా ఓకే...! 1 y ago
ఉక్రెయిన్ తో యుద్ధం ముగించేందుకు కొన్ని షరతుల మేరకు తాత్కాలిక ఒప్పందానికి సిద్ధమేనని రష్యా తెలిపింది. ఇటీవల అమెరికా ప్రతినిధులతో శాంతి ఒప్పందంపై జరిగిన చర్చల్లో తుది పరిష్కారానికి తమ అభ్యర్థనలను తెలిపినట్లు అక్కడి అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా, దీనిపై క్రెమ్లిన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. శాంతి సాధనకు సిద్ధంగా ఉన్నామని, బలమైన తుది ఒప్పందం కోసం అమెరికాతో కలిసి పనిచేస్తామని జెలెన్స్కీ వెల్లడించారు.